లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ సూచీలు | Today Stock Market Update | Sakshi
Sakshi News home page

లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ సూచీలు

May 8 2023 9:54 AM | Updated on May 8 2023 9:54 AM

Today Stock Market Update - Sakshi

అంతర్జాతీయ సానుకూల అంశాలు, కంపెనీల కార్పొరేట్‌ ఫలితాలు పాజిటీవ్‌గా ఉండడంతో దేశీయ మదపర్లు పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా  సోమవారం ఉదయం దేశీయ స్టాక్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.  

ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్‌ 434 పాయింట్లు లాభపడి 61489 పాయింట్ల వద్ద నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 18187 వద్ద కొనసాగుతున్నాయి. 

కోల్‌ ఇండియా, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, సన్‌ ఫార్మా, అపోలో హాస్పిటల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌,ఇన్ఫోసిస్‌,అదానీ పోర్ట్స్‌ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఇండస్‌ ఇండ్‌,ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, కొటక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓన్‌జీసీ,హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement