బంగారం, వెండి ధరలు: ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసా? | Today Gold and Silver Price 16 June 2024 | Sakshi
Sakshi News home page

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసా?

Published Sun, Jun 16 2024 1:07 PM | Last Updated on Sun, Jun 16 2024 1:19 PM

Today Gold and Silver Price 16 June 2024

జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నిన్న రూ. 660 తగ్గిన బంగారం ధరలు నేడు (జూన్ 16) ఉలుకు పలుకు లేకుండా ఉన్నట్లు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72550 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72700 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు.

చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 67050 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73150 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (జూన్ 16) ఒక కేజీ వెండి ధర రూ. 91000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇది బంగారం, వెండి కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement