మన ఎకానమీ పటిష్టంగానే ఉంది | Tata Sons chairman outlines three steps for sustained economic growth | Sakshi
Sakshi News home page

మన ఎకానమీ పటిష్టంగానే ఉంది

Oct 6 2026 5:12 AM | Updated on Oct 6 2026 5:12 AM

Tata Sons chairman outlines three steps for sustained economic growth

ఇంధన భద్రత, ఉద్యోగాల కల్పన కీలకం 

టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు. దీర్ఘకాలిక వృద్ధిని నిలబెట్టుకోవాలంటే ఆధునిక తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన, ఇంధన భద్రతలాంటి అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. విస్తృత స్థాయిలో విస్తరించిన వికసిత్‌ భారత్‌ 2047 విజన్‌ను సాకారం చేసుకోవాలంటే అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, సంస్థలు, మేధోహక్కుల పునాదుల ఆధారంగా సమ్మిళిత, సుస్థిర అభివృద్ధిని సాధించాల్సి ఉంటుందని తెలిపారు. 

ఇండియన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఐఎఫ్‌క్యూఎం) సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖరన్‌ ఈ విషయాలు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు భేషుగ్గా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ గత అనేక సంవత్సరాలుగా అంచనాలకు మించి వృద్ధి సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా డిమాండ్, సరీ్వసుల ఎగుమతులతో పాటు విధానాలపరంగా ప్రభుత్వ దన్ను మొదలైనవి ఇందుకు దోహదపడుతున్నాయని వివరించారు. వాహన విక్రయాలు, రుణాలు, విద్యుత్, సిమెంటుకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని చంద్ర చెప్పారు.  

నాణ్యతకు ప్రాధాన్యం.. 
సుదీర్ఘకాలం పాటు నిలకడగా వృద్ధి సాధించాలంటే ఇంధన భద్రత సహా చాలా అంశాలు కలిసి రావాలని చంద్రశేఖరన్‌ చెప్పారు. జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటాను ప్రస్తావిస్తూ, ఆ సంస్థ  నాణ్యతకు ఎంత ప్రాధాన్యమిచ్చేది వివరించారు. వాహనాల తయారీలోనే కాకుండా కొత్త ఆవిష్కరణలు, ఉత్పాదకత విషయంలో కూడా నాణ్యతకు కంపెనీ పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా కూడా నాణ్యత ద్వారానే అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను జర్మనీ సాధించిందని చంద్రశేఖరన్‌ చెప్పారు. భారత్‌లో కూడా ఆ విధమైన పరివర్తన రావాల న్నారు. 

ఈవీలే పరిష్కార మార్గం కాదు.. 
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే పరిష్కార మార్గం కాబోవని టీవీఎస్‌ మోటార్స్‌ గౌరవ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ తెలిపారు. నిర్దిష్ట టెక్నాలజీపైనే ఆధారపడటం కాకుండా ఎలాంటి సాంకేతికతను వాడినా సరే అంతిమంగా ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా, వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపాలనే ప్రభుత్వ విధానమనేది ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement