నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on december 17 2024 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Dec 17 2024 9:50 AM | Updated on Dec 17 2024 11:03 AM

stock market updates on december 17 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరింది. సెన్సెక్స్‌ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 107 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73.78 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.38 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.24 శాతం ఎగబాకింది.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్‌ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్‌ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్‌) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్‌ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్‌ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ అమ్మకాలు వెల్లడికానున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement