వెండి భారీ పతనం.. కిలోపై రూ.2.55 లక్షలు డౌన్! | Silver Prices Fall By Rs 2 55 Lakh Per KG From January | Sakshi
Sakshi News home page

వెండి భారీ పతనం.. కిలోపై రూ.2.55 లక్షలు డౌన్!

Nov 28 2026 12:00 PM | Updated on Nov 28 2026 12:14 PM

Silver Prices Fall By Rs 2 55 Lakh Per KG From January

మార్కెట్లో వెండి రేటు రోజు రోజుకి భారీగా పతనమవుతోంది. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన వెండి ధరలు అమాంతం పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా.. ఈ ఏడాది ప్రారంభంలో (జనవరి) నమోదైన గరిష్ఠ ధరతో పోలిస్తే.. కిలో వెండిపై ఏకంగా రూ.2.55 లక్షల వరకు తగ్గుదల కనిపించింది.

జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 2026 నవంబర్ 25 నాటికి రూ.1.65 లక్షలకు చేరింది. దీన్నిబట్టి చూస్తే సిల్వర్ రేట్లు నెలల వ్యవధిలోనే భారీగా దిగివచ్చాయని స్పష్టమవుతోంది.

వెండి ధర తగ్గడానికి కారణాలు
డాలర్ విలువ: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడితే.. బంగారం, వెండి ధరలపై ప్రభావం ఉంటుంది. దీంతో వెండి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

వడ్డీ రేట్ల ప్రభావం: అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయనే అంచనాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు వెండి కంటే ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపుతారు. ఇది కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతుంది.

పరిశ్రమల నుంచి డిమాండ్: సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండిని ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ తగ్గితే వెండి ధరలు పడిపోతాయి.

మార్కెట్ ప్రభావం: అమెరికా, చైనా వంటి దేశాల్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, తయారీ రంగం మందగించినా వెండికి డిమాండ్ తగ్గుతుంది. దీంతో ప్రపంచ మార్కెట్లో ధరలు దిగివస్తాయి.

ధరల్లో ఎక్కువ హెచ్చుతగ్గులు: బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ధరలు పెరిగేటప్పుడు వేగంగా పెరుగుతాయి. తగ్గేటప్పుడు కూడా అదే స్థాయిలో పడిపోయే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు వెండి కొనుగోలు చేయవచ్చా?
వెండి ధరలు భారీగా తగ్గడంతో.. ఇప్పుడు కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే.. ధరలు ఇప్పటికే తగ్గాయని భావించి మొత్తం డబ్బును ఒకేసారి పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం కాదని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్లో ఇంకా ఒడుదొడుకులు కొనసాగితే.. వెండి ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యంతో ఉన్నవారు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకుండా, పెట్టుబడిని మూడు లేదా నాలుగు విడతలుగా విభజించుకోవడం మంచిది.

ఉదాహరణకు.. మీ దగ్గర వెండిలో పెట్టుబడి పెట్టడానికి రూ.1 లక్ష ఉంటే, మొత్తాన్ని ఒకేసారి పెట్టకుండా వేర్వేరు సమయాల్లో కొంత మొత్తాన్ని కేటాయించవచ్చు. ఇలా చేయడం వల్ల ధరల్లో వచ్చే మార్పుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారం, వెండి వాటా ఎంత ఉండాలనే విషయాన్ని కూడా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి.

ఈ రోజు వెండి ధరలు ఇలా..

వెండి ధరలు1
1/2

వెండి ధరలు2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement