దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, సిమెంట్ షేర్లు క్షీణించడంతో బెంచ్ మార్క్ సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 539.35 పాయింట్లు లేదా 0.7 శాతం క్షీణించి 76,933.59 వద్ద, నిఫ్టీ 50 116.90 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి.
హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.1 శాతం, 0.13 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ సిమెంట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.


