ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ప్రవాస భారతీయుల (ఎన్నారై) డిపాజిట్లు 2.775 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 23.2 శాతం క్షీణించినట్లు వివరించింది.
2025–26 తొలి త్రైమాసికంలో 3.614 బిలియన్ డాలర్ల ఎన్నారై డిపాజిట్లు వచ్చినట్లు పేర్కొంది. తాజా డిపాజిట్లు నెమ్మదించినప్పటికీ ఎన్‌ఆర్‌వో, ఎఫ్‌సీఎన్‌ఆర్ (బి) డిపాజిట్ల దన్నుతో మొత్తం ప్రవాసుల డిపాజిట్ల పరిమాణం 168.327 బిలియన్ డాలర్ల నుంచి 168.506 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ వివరించింది.
ఇదీ చదవండి: చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు!


