సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 16 2024 9:32 AM | Updated on Apr 16 2024 9:35 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 22,183కు చేరింది. సెన్సెక్స్‌ 343 పాయింట్లు దిగజారి 73,059 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 90.5 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.2 శాతం నష్టాలపాలైంది. నాస్‌డాక్‌ 1.79 శాతం దిగజారింది.

ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, సర్వీసెస్‌, ఐటీ, బ్యాంకింగ్‌ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు సోమవారం భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్‌ మార్కెట్లు కోలుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement