సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌ సూచీలు

Mar 12 2024 3:23 PM | Updated on Mar 12 2024 3:31 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 179 పాయింట్లు పుంజుకుని పెరిగి 73,672 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల నష్టపోయి 22,330 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, మారుతిసుజుకీ, ఇన్ఫోసిస్‌, భారతిఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. 

ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, నెస్లే, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, విప్రో, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్రాబ్యాంక్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement