దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు అంతకంతకూ పతనమవుతూ వచ్చాయి. బ్రెంట్ క్రూడ్4శాతం పెరిగి బ్యారెల్ కు 104 డాలర్ల మార్కును తాకడం ఒత్తిడిని పెంచింది. సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు లేదా 1.44 శాతం క్షీణించి 71,593.24 వద్ద, నిఫ్టీ 371.25 పాయింట్లు లేదా 1.64 శాతం క్షీణించి 22,231.80 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. 30 సెన్సెక్స్ సంస్థల్లో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. ఐటీసీ, ఇండిగో, పవర్ గ్రిడ్, బీఈఎల్ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.34 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ మెరుగనిపించింది.


