దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. భారతీయ బెంచ్ మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈరోజు ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 23,970.40 వద్ద, సెన్సెక్స్(Sensex) 721.13 పాయింట్లు 0.93 పతనంతో 76,688.84 వద్ద ట్రేడవుతోంది.
ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.55 శాతం, 0.19 శాతం నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ దాదాపు 6 శాతం క్షీణతతో అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా భారీగానే నష్టాలనే నమోదు చేశాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.


