భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌: అవే షేర్లు నిలబెట్టాయ్‌ | Stock Market Close Update On June 24th 2026, Sensex Jumps 790 Points And Nifty Gains On IT And Realty Boost | Sakshi
Sakshi News home page

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌: అవే షేర్లు నిలబెట్టాయ్‌

Jun 24 2026 3:54 PM | Updated on Jun 24 2026 4:21 PM

Stock Market Close 24 June 2026 Sensex climbs 791 points IT bank shares lead

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 197.55 పాయింట్ల లాభంతో 24,021.65 వద్ద, సెన్సెక్స్ 1.04 శాతం లేదా 790.54 పాయింట్లు పెరిగి 76,991.22 వద్ద స్థిరపడ్డాయి.

నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రెంట్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.39 శాతం పెరిగాయి.

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ 2 శాతానికి పైగా లాభంతో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. మరొవైపు నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement