టెక్ ప్రపంచాన్ని మార్చిన జాబ్స్.. సీఈఓల ఎమోషనల్ పోస్ట్! | Steve Changed The World Tim Cook and John Ternus Posts | Sakshi
Sakshi News home page

టెక్ ప్రపంచాన్ని మార్చిన జాబ్స్.. సీఈఓల ఎమోషనల్ పోస్ట్!

Oct 6 2026 12:03 PM | Updated on Oct 6 2026 12:29 PM

Steve Changed The World Tim Cook and John Ternus Posts

యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణించి 2026 అక్టోబర్ 5 నాటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే.. ఆయన ప్రపంచాన్ని, ముఖ్యంగా టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేసిన తీరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జాబ్స్‌ను గుర్తు చేసుకుంటూ యాపిల్ మాజీ సీఈఓ, ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు టిమ్ కుక్, ప్రస్తుత ఆపిల్ సీఈఓ జాన్ టెర్నస్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నివాళులు అర్పించారు.

టిమ్ కుక్
ప్రపంచంపై తమదైన ముద్ర వేసేవారు కొందరు ఉంటారు, అలాగే ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసేవారు కూడా కొందరు ఉంటారు. స్టీవ్ ప్రపంచాన్ని మాత్రమే కాకుండా.. ఎంతోమంది జీవితాలను మార్చాడు. నా జీవితాన్ని కూడా ఆయన మార్చేశారు అని టిమ్ కుక్ పేర్కొన్నారు. అతను సృష్టించిన ప్రతిదానిలోనూ, అతను స్ఫూర్తినిచ్చిన ప్రతి ఒక్కరిలోనూ అతని స్ఫూర్తి ఇప్పటికీ జీవిస్తూనే ఉందని అన్నారు.

జాన్ టెర్నస్
ప్రస్తుత యాపిల్ సీఈఓ జాన్ టెర్నస్ కూడా జాబ్స్‌ను గుర్తు చేసుకున్నారు. ఒక ఉత్పత్తిలో ప్రతి చిన్న విషయానికి, ప్రతి అనుభవానికి, ప్రతి వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని జాబ్స్ నేర్పిన విధానం ఇప్పటికీ యాపిల్‌లో పనిచేసే ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉందని ఆయన చెప్పారు. స్టీవ్ జాబ్స్ నుంచి నేర్చుకున్న విషయాలకు తాను ఎప్పటికీ కృతజ్ఞుడినని టెర్నస్ పేర్కొన్నారు.

స్టీవ్ జాబ్స్ ఆలోచనా విధానం
నిజానికి స్టీవ్ జాబ్స్ ఆలోచనా విధానం.. యాపిల్ సంస్థలో ఇప్పటికీ కనిపిస్తుంది. టెక్నాలజీ ఎంత క్లిష్టంగా ఉన్నా, దాన్ని వినియోగదారులకు సులభంగా, అందంగా, ఉపయోగించడానికి అనుకూలంగా అందించాలనేది ఆయన ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటినీ కలిపి ఒక మంచి వినియోగదారు అనుభవాన్ని అందించడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు.

ప్రస్తుతం యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్పేషియల్ కంప్యూటింగ్, కొత్త తరహా హార్డ్‌వేర్ వంటి రంగాల్లోకి విస్తరిస్తున్నప్పటికీ, ఉత్పత్తులను తయారు చేసే విధానంలో జాబ్స్ ఆలోచనలు ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయని ఈ నివాళులు స్పష్టం చేస్తున్నాయి.

స్టీవ్ జాబ్స్ తన ఆరోగ్యం క్షీణించిన సమయంలో.. యాపిల్ సీఈఓ బాధ్యతలను టిమ్ కుక్‌కు అప్పగించారు. జాబ్స్ మరణించిన తర్వాత కుక్ సంస్థను ముందుకు నడిపించారు. ఇప్పుడు యాపిల్ సంస్థకు.. హార్డ్‌వేర్ రంగంలో అనుభవం ఉన్న జాన్ టెర్నస్ నాయకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: రాజీనామా లెటర్‌తో బాస్‌కు షాక్.. బయటపడ్డ అసలు నిజం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement