
యూఎస్ వీసా రావాలంటే కష్టమని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇటీవల వీసా ఇంటర్వ్యూకు హాజరైన ఒక స్టార్టప్ ఫౌండర్‌కు ఇట్టే వీసా అప్రూవ్ అయింది. తన వీసా ఇంటర్వ్యూలో ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో తనకు, తన భార్యకు యూఎస్ వీసా వచ్చినట్లు ప్రణవ్ దత్ ఓ పోస్ట్‌లో ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకీ వీసా ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలేంటో కింద చూద్దాం.
ప్రణవ్‌కు ఎలాంటి ఆదాయం లేదు. పాత కంపెనీలో ఉద్యోగం వదిలేయడంతో ఎలాంటి ఉపాధి పత్రాలు లేవు. గతంలోనూ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోలేదు. నిజాయితీగా దరఖాస్తు చేస్తే తప్పకుండా వీసా అవకాశం వస్తుందని తెలుసుకుని అప్లై చేశాడు. అమెరికా వీసా లేకపోయినా ‘ఎస్ఏఎస్ 1 మిలియన్ మైల్ ఛాలెంజ్’లో పాల్గొంటూ ప్రణవ్ దత్, ఆయన భార్య శ్రుతి పాటిల్ పలు దేశాల్లో పర్యటించారు. యూఎస్ వీసాకు సంబంధించి అభ్యర్థులు ఎంత నిజాయితీగా సమాధానం చెబుతున్నారు, ఎంత స్పష్టంగా కమ్యునికేట్ చేస్తున్నారో ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు.
ఇదీ చదవండి: ‘మెటాలా అనైతిక ఆఫర్ ఇవ్వట్లేదు’
ముంబై కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ కోసం అడిగిన ప్రశ్నలు
1. యూఎస్ ఎందుకు వెళుతున్నారు?
2. యూఎస్‌లో ఎవరినైనా కలవాలనుకుంటున్నారా?
3. మీ యూఎస్ ఫ్రెండ్ ఎక్కడ పనిచేస్తున్నాడు?
4. మీరు ఇంతకు ముందు ఎక్కడ ప్రయాణించారు?
5. ఏం చేస్తారు? (ఇద్దరిని)
6. మీ ట్రిప్‌కు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు?
7. మీకు పెళ్లయిందా?
8. పిల్లలు ఉన్నారా?
9. ఇష్టమైన లాయల్టీ ప్రోగ్రామ్ ఏది?