అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఇండియన్‌ కంపెనీ | SS Innovations lists on Nasdaq | Sakshi
Sakshi News home page

అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఇండియన్‌ కంపెనీ

Jun 8 2025 1:34 PM | Updated on Jun 8 2025 1:49 PM

SS Innovations lists on Nasdaq

న్యూఢిల్లీ: దేశీ మెడికల్‌ టెక్నాలజీ కంపెనీ ఎస్‌ఎస్‌ ఇన్నోవేషన్స్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా అమెరికాలోని నాస్డాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా ఓపెనింగ్‌ బెల్‌ మోగించే కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు సు«దీర్‌ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

కంపెనీ రూపొందించిన ఎస్‌ఎస్‌ఐ మంత్ర సర్జికల్‌ రోబోటిక్‌ సిస్టం ప్రస్తుతం దేశీయంగా 75 ప్రాంతాల్లోని 80 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. వీటితో 100 పైగా సర్జికల్‌ ప్రొసీజర్లకు సంబంధించి 4,000 పైగా రోబోటిక్‌ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.

అటు అంతర్జాతీయంగా నేపాల్, కొలంబియా, ఉక్రెయిన్, ఈక్వెడర్‌ తదితర దేశాల్లోనూ కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. 2024 డిసెంబర్‌తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ ఆదాయం 3.5 రెట్లు వృద్ధి చెంది 5.9 మిలియన్‌ డాలర్ల నుంచి 20.6 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. స్థూల మార్జిన్లు 12.3 శాతం నుంచి 40.9 శాతానికి ఎగిశాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement