స్కోడా ఆటో ఇండియా.. ఎట్టకేలకు తన అప్‌డేటెడ్ స్లావియా ధరలను ప్రకటించింది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). డెలివరీలు వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఈ లేటెస్ట్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కొత్త స్లావియా.. క్లాసిక్, క్లాసిక్+, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇది భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేసిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మితమైంది.
డిజైన్
ఈ అప్డేటెడ్ స్లావియా కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్‌లను పొందుతుంది. టెయిల్‌ల్యాంప్‌లు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను కలిగి ఉన్నాయి. గ్రిల్‌కు ఇప్పుడు అడ్డంగా.. ఒక క్రోమ్ స్ట్రిప్ అమర్చబడింది, అలాగే ముందు.. వెనుక భాగాలను కొంత అప్డేట్ చేశారు.
ఫీచర్స్
ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో అప్డేటెడ్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన 25.6 సెంమీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో జెమిని ఇంటిగ్రేషన్‌తో, గూగుల్ క్లౌడ్ ఆటోమోటివ్ ఏఐ ఏజెంట్‌ను ఉపయోగించే ఏఐ బేస్డ్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ సిస్టమ్ వాయిస్ కమాండ్‌ల ద్వారా రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. మ్యూజిక్, కాల్స్, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫంక్షన్‌లను కంట్రోల్ చేస్తుంది.
ఇంజన్ డీటెయిల్స్
స్లావియా 1.0-లీటర్, 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌లతో కొనసాగుతుంది. 1.0 లీటర్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉంది. 1.5 లీటర్ ఇంజన్‌కు 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.
స్లావియా అప్డేటెడ్ మోడల్.. పెద్దలు, పిల్లల భద్రత కోసం తన 5-స్టార్ గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్‌ను నిలుపుకుంది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 25కు పైగా యాక్టివ్, పాసివ్ భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా ఉండగా.. ఉన్నత శ్రేణి వేరియంట్లలో 40కి పైగా భద్రతా ఫీచర్లు లభిస్తాయి.
ఇదీ చదవండి: టెక్ ప్రపంచాన్ని మార్చిన జాబ్స్.. సీఈఓల ఎమోషనల్ పోస్ట్!


