
స్కోడా కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కైలాక్ కారు అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. కేవలం 8 నెలల్లో 30000 యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్ సాధించింది. ఇది కంపెనీ సేల్స్ పెరగడానికి కూడా దోహదపడింది.
2025 జనవరిలో 1242 యూనిట్ల అమ్మకాలను సాధించిన స్కోడా కైలాక్.. ఆగస్టులో 3099 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. ఇలా మొత్తం మీద ఈ కారు జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 30190 అమ్మకాలు పొందింది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇదీ చదవండి: దేశంలో అత్యంత సరసమైన 5 బైకులు ఇవే!
స్కోడా కైలాక్ 1.10 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ మరియు ప్రెస్టీజ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.