
భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. లెక్కకు మించిన కంపెనీలు దేశీయ విఫణిలో కొత్త టూ వీలర్స్ లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 (GST 2.0) అమలులోకి వచ్చిన తరువాత వీటి ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని సరసమైన బైకులు (Affordable Bikes) ఏవి?, వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.
బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100 ధర రూ. 65,407 (ఎక్స్ షోరూమ్) చేరింది. ఈ బైక్ 102 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 7.9hp పవర్ & 8.3Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.
హోండా షైన్ 100
హోండా షైన్ 100 ధర రూ. 63,191 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 98.98 సీసీ ఇంజిన్ 7.38 హార్స్ పవర్, 8.04 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి.. కొంత ఎక్కువ మైలేజ్ ఇస్తున్న కారణంగా ఈ బైకుకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
హీరో హెచ్ఎఫ్ 100
హీరో హెచ్ఎఫ్ 100 ధర రూ. 58739 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్.. 7.9 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 65 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్
దేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో.. టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ కూడా ఒకటి. దీని ధర రూ. 55100 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ ద్వారా 7.3 హార్స్ పవర్, 7.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 2020లో బీఎస్6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అయింది.