పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సీరియస్.. ఈ సేవలన్నీ బంద్! | SC Order On Unpaid Traffic Challans Impact On RC PUC and Licence | Sakshi
Sakshi News home page

పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సీరియస్.. ఈ సేవలన్నీ బంద్!

Oct 4 2026 4:12 PM | Updated on Oct 4 2026 4:57 PM

SC Order On Unpaid Traffic Challans Impact On RC PUC and Licence

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు.. విధించే ఈ-చలాన్లను చెల్లించకుండా కొందరు అలాగే వదిలేస్తుంటారు. ఇంకొందరు తర్వాత కడదాం అని పెండింగ్‌లో పెట్టేస్తారు. కానీ.. ఇక అలా చేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను కచ్చితంగా వసూలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

వాహనాలకు చలాన్ జారీ చేస్తే సరిపోదు, ఆ చలాన్‌కు సంబంధించిన జరిమానా కూడా వసూలు చేయాలి. దేశవ్యాప్తంగా ఇప్పటికే వేల కోట్ల రూపాయల ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.

కోర్టుకు అందిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు రూ.49,194 కోట్లకు పైగా ఈ-చలాన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు సుమారు రూ.26,175 కోట్లు వసూలు చేశారు. దీంతో మిగిలిన మొత్తాన్ని కూడా వసూలు చేసేందుకు అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉంటే వాహనానికి సంబంధించిన కొన్ని సేవలు పొందడంలో ఇబ్బందులు రావచ్చు. ఇందులో వెహికల్ RC రెన్యువల్ చేయడం, డూప్లికేట్ RC తీసుకోవడం, వాహన యజమాని చిరునామా మార్చడం వంటి సేవలను నిలిపివేయవచ్చు. అలాగే వెహికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడంపైనా ప్రభావం పడొచ్చు. పదేపదే తప్పులు చేస్తుంటే.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ప్రతి ఏడాది హైక్ వస్తున్నా.. జీతం తక్కువేనా?: కారణం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement