సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్‌కు భిన్నం
ఈక్విటీ క్యాష్, డెరివేటివ్స్‌లోనూ పెట్టుబడులు
పరిస్థితులకు అనుగుణంగాదూకుడైన విధానాలు
వివిధ సాధనాల మధ్య చురుకైన కేటాయింపులు
దీర్ఘకాలంలో అదనపు రాబడులకు మార్గం
అధిక పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయ వేదిక
ఈక్విటీల్లో మెరుగైన రాబడులకు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కని మార్గం. ఈక్విటీలకు మించి అధిక రాబడులు, ప్రత్యామ్నాయ సాధనాల్లో పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ వంటి సర్వీసులు (పీఎంఎస్) సైతం ఉన్నాయి.
కానీ, ఈక్విటీల్లోనే అధిక రిస్క్ తో మరింత రాబడి కోరుకునే వారి పరిస్థితి ఏంటి? ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (సిఫ్) సాధనం ఇటీవలే మార్కెట్ ప్రవేశం చేసింది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్–హెడ్జ్ ఫండ్ తరహా పెట్టుబడులకు మధ్య వారధిగా దీన్ని రూపొందించారు. కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం వచ్చిన ఈ సాధనంతో సంపద సృష్టి సాధ్యమేనా..? బడా ఇన్వెస్టర్లు సైతం ఎందుకు ‘సిఫ్’పై మనసు పారేసుకుంటున్నారు? ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (సిఫ్)లు సాధారణ మ్యూచువల్ ఫండ్స్ మాదిరి కావు. డెరివేటివ్స్ మార్కెట్లో (ఫ్యూచర్స్–ఆప్షన్స్) ఇవి లాంగ్–షార్ట్ వ్యూహాలను అనుసరిస్తాయి. డెట్ సెక్యూరిటీలు, ఈక్విటీ–డెట్ కలిసిన హైబ్రిడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అసెట్ అలోకేషన్ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుంటాయి. అంటే వివిధ సాధనాల మధ్య కేటాయింపులను ఎప్పటికప్పుడు పరిస్థితులు, అవకాశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాయి. రంగాల వారీ పెట్టుబడులను వ్యూహాత్మకంగా మారుస్తుంటాయి. హెడ్జింగ్ విధానాలను కూడా అనుసరిస్తాయి. అంటే పెట్టుబడుల విలువ భారీగా పడిపోకుండా వ్యూహాలను ఆచరణలో పెడతాయి.
తేడా ఏంటి?
→ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్లు ర్యాలీ చేసినప్పుడే రాబడులను ఇవ్వగలవు.
→ సిఫ్‌లు మాత్రం మార్కెట్లు ఆటుపోట్లు, అస్థిరతలను చవిచూస్తున్న తరుణంలో లేదా మార్కెట్లు పడిపోతున్న తరుణంలోనూ షార్ట్‌సెల్లింగ్ విధానాలు, హెడ్జింగ్ వ్యూహాలతో రాబడులను ఇవ్వగలవు.
→ ఉదాహరణకు ఒక లాంగ్–షార్ట్ సిఫ్ 75–80 శాతం పెట్టుబడులను క్యాష్ మార్కెట్లో లాంగ్ పొజిషన్లకు కేటాయించి.. 20–25 శాతాన్ని డెరివేటివ్స్‌లో షార్ట్ పొజిషన్లపై పెట్టుబడిగా పెడుతుంది.
→ రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలమైన ప్రత్యా మ్నాయ పెట్టుబడి సాధనంగా సిఫ్‌లను నిపుణులు అభివర్ణిస్తున్నారు.
రాబడికి గ్యారంటీ లేదు..? రిస్కూ ఎక్కువే!
→ సిఫ్‌ల్లోనూ రిస్క్ చాలా ఎక్కువ. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులకు ఎలాంటి హామీ ఉండదు.
→ ఎందుకంటే సిఫ్‌లు డెరివేటివ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పొజిషన్లలో తరచూ మార్పులు చేస్తుంటాయి.
→ ఫండ్ మేనేజర్ ప్రతిభ, రిస్క్ సామర్థ్యాలు, మార్కెట్ సైకిల్స్, నిర్వహణలో క్రమశిక్షణ ఇలాంటి అంశాలెన్నో రాబడులను నిర్ణయిస్తుంటాయి.
→ నిర్వహణ సరిగ్గాలేని సిఫ్‌లలో రాబడి తక్కువే ఉండొచ్చు. అదే సమయంలో నాణ్యమైన సిఫ్‌లు ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించగలవు.
→ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్/ఫ్లెక్సీ/మల్టీక్యాప్)లో రిస్క్ సిఫ్‌లతో పోల్చితే తక్కువే. కొంత రాబడుల పరంగానూ స్థిరత్వం ఉంటుంది.
→ ఎందుకంటే నాణ్యమైన కంపెనీలు, చక్కని యాజమాన్యం, ఆయా రంగాల్లో వ్యాపార అవకాశాల ఆధారంగా దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
→ సిఫ్‌లు దూకుడుగా ఏక కాలంలో ఒకటికి మించిన వ్యూహాలను అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్ ఎక్కువే.
→ కానీ, దీర్ఘకాలంలో సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే సిఫ్‌లు 3–8% మేర అధిక రాబడులను ఇవ్వగలవన్నది విశ్లేషకుల అంచనా.
→ సగటున 6 శాతం అధిక రాబడి వచ్చినా దీర్ఘకాలంలో సంపద సృష్టి పరంగా చెప్పుకోతగ్గంత వ్యత్యాసం ఉంటుంది.
ఉదాహరణ: రూ.10 లక్షలు ఏటా 12 శాతం చొప్పున పెరిగితే 10 ఏళ్లలో రూ.31 లక్షలు అవుతుంది. అదే ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ పోతే పదేళ్లకు రూ.52 లక్షలు అవుతుంది.
బడా ఇన్వెస్టర్లలో ఆసక్తి
→ కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది.
→ బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్‌లపై అమితాసక్తి చూపిస్తున్నారు.
→ ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి.
→ రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్‌లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి.
→ ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధా→ కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది.
→ బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్‌లపై అమితాసక్తి చూపిస్తున్నారు.
→ ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి.
→ రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్‌లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి.
→ ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధానం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్‌లాంటివే మెరుగ్గా రాణించగలవు.
→ పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్‌లు పాటిస్తాయి.
→ పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
→ కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్‌ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.నం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్‌లాంటివే మెరుగ్గా రాణించగలవు.
→ పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్‌లు పాటిస్తాయి.
→ పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
→ కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్‌ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.
లిక్విడిటీ ఎక్కువే..
→ సిఫ్‌లలో లిక్విడిటీ ఎక్కువ. అయినప్పటికీ, వీటిలో షార్ట్–టర్మ్ ట్రేడింగ్‌ను నిరుత్సాహపరచడానికి చాలా ఫండ్స్ మొదటి 6 నెలలు లేదా ఏడాదిలోపు పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ‘ఎగ్జిట్ లోడ్’ విధిస్తున్నాయి.
→ ఏఐఎఫ్‌లలో పెట్టుబడి కొన్నేళ్ల పాటు లాకిన్ అవుతుంది.
→ సిఫ్‌లలో రోజువారీ, వారం, క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
→ కానీ, కనీసం ఐదేళ్లపాటు అయినా సిఫ్‌లలో పెట్టుబడి కొనసాగించినప్పుడే మెరుగైన రాబడులను చూడగలరన్నది విశ్లేషకుల అభిప్రాయం.
→ ప్రస్తుతానికి మార్కెట్లో 9 సిఫ్‌లే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని సంఖ్యలో, మరిన్ని వ్యూహాలతో అందుబాటులోకి రానున్నాయి.
→ మెరుగైన రిస్క్ నిర్వహణ, వైవిధ్యంతో కూడిన సిఫ్‌లను దీర్ఘకాలంలో కాస్త అదనపు రాబడికి మార్గంగా భావించొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.
→ అంతిమంగా రాబడులు అన్నవి ఇన్వెస్టర్ల ధోరణి, క్రమశిక్షణపైనా ఆధారపడి ఉంటాయన్నది విస్మరించొచ్చు.
రాబడులు ?
సిఫ్‌లో రాబడులకు దీర్ఘకాల చరిత్ర లేదు. 2024లో సెబీ ఈ విభాగానికి పచ్చజెండా ఊపగా.. మొదటి సిఫ్.. క్వాంట్ లాంగ్–షార్ట్ ఫండ్ 2025 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది.
ఎంత మేర ఆశించొచ్చు?
ఫండ్ నిపుణుల అంచనాలు..
స్ట్రాటజీ వార్షిక రాబడి
(విధానం) అంచనా (%లో)
హైబ్రిడ్ లాంగ్–షార్ట్ సిఫ్ 10–16
ఈక్విటీ లాంగ్–షార్ట్ సిఫ్ 14–22
టాక్టికల్/సెక్టార్ రొటేషన్ సిఫ్ 18
డెట్ లాంగ్–షార్ట్ సిఫ్ 8–12
– సాక్షి, వెల్త్


