మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు

Rs 3847 Crores Bank Fraud cbi case on Mumbai Unity Infra Projects - Sakshi

వేలకోట్ల నిధులను స్వాహా చేసిన అక్రమార్కులు

2014, జూన్ 24 లోనే ఎన్‌పీఏగా ఎస్‌బీఐ ఖాతా

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను వేల కోట్లకు ముంచేసిన స్కాం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముంబైకి చెందిన డెవలపర్‌ యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కిషోర్ కృష్ణ అవర్‌సేకర్,  ప్రమోటర్లు అభిజీత్ కిషోర్ అవర్‌సేకర్, ఆశిష్ అవర్‌సేకర్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) అభియోగాలు మోపింది.   

ముగ్గురు డైరెక్టర్లు,  కొంతమంది గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులతోపాటు పలువురు అధికారులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఎస్‌బీఐతోపాటు ఇతర, 15 బ్యాంకుల కన్సార్టియంనురూ. 3,847.58 కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముంబైలోని స్ట్రెస్‌డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్, ఎస్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైంది. 

ముంబైలోని తమవాణిజ్య శాఖలో మోసం జరిగిందని, నిందితులు కల్పిత లావాదేవీలు చేయడం, బ్యాంకును మోసం చేయడం, చట్టవిరుద్ధంగా, మోస పూరితంగా ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి బ్యాంకు నిధులను స్వాహా చేశారని ఈ కేసులో, ఆగస్ట్ 17, 2023న, ఎస్‌బీఐ డీజీఎం (ముంబయి) రజనీకాంత్ ఠాకూర్, యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, దాని డైరెక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. (మోదీజీ వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్‌: ఫాక్స్‌కాన్‌ పోస్ట్‌ వైరల్‌)

మొత్తం 23 బ్యాంకులు.. కానీ
మొత్తం 23 బ్యాంకులున్నప్పటికీ, కేవలం 16 బ్యాంకులు మాత్రమే తమ అంచనా నష్టాలను నివేదించాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఉన్నాయి.

కాగా 2012లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత మంత్రాలయ భవనం పునరుద్ధరణ, కళానగర్‌లో థాకరే కుటుంబ బంగ్లా మాతోశ్రీ నిర్మాణం, దాదర్ టీటీ ఫ్లై ఓవర్, CSM సబ్వే లాంటి నిర్మాణాలకు యూనిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్  పాపులర్‌. (పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top