అనిశ్చితులకు బంగారం సరికొత్త కొలమానం | RBI Governor Stated Gold Overtaken Oil As Global Barometer, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ అనిశ్చితులకు బంగారం సరికొత్త కొలమానం

Oct 4 2025 9:00 AM | Updated on Oct 4 2025 9:26 AM

RBI Governor stated gold overtaken oil as global barometer

ప్రపంచ అనిశ్చితులకు సరికొత్త కొలమానంగా బంగారం ధరలు వ్యవహరిస్తుట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు ఎలా ఉండేవో బంగారం ధరలు కూడా అలాగే మారినట్టు చెప్పారు. ద్రవ్యపరంగా నేడు ప్రతి దేశం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న వాణిజ్య విధాపరమైన వాతావరణం కొన్ని ఆర్థిక వ్యవస్థల వృద్ధికి నష్టం కలిగించనున్నట్టు తెలిపారు.

ఈ పరిస్థితుల్లో కొన్ని స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌ను చూడొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటూ.. ఈక్విటీ మార్కెట్లు సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో ర్యాలీ వెనుక టెక్నాలజీ స్టాక్స్‌ పాత్రను ప్రస్తావిస్తూ.. త్వరలో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చన్నారు.

‘భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు మునుపటి దశాబ్దంలో చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఒక శ్రేణికి పరిమితమయ్యాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో చమురు అవసరాలు తగ్గడం ఇందుకు కారణం. గతంలో ప్రపంచ అనిశ్చితులను చమురు ధరలు ఎలా అయితే కొలమానంగా పనిచేశాయో.. ఇప్పుడు బంగారం ధరలు తీరు కూడా అలాగే ఉంది’ అని మల్హోత్రా వివరించారు.

ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement