ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా? | Sakshi
Sakshi News home page

iPhone 16: ఫోన్లు ఇలాగే ఉంటాయా?

Published Fri, Jan 5 2024 10:07 PM

Prototypes for Apple iPhone 16 Pro and Pro Max leaked - Sakshi

కొత్త ఏడాదిలో యాపిల్‌ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్‌లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16),  ప్రో,  ప్రో మ్యాక్స్ మోడల్స్‌ లుక్‌, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్‌ లీక్ అయింది. 

యాపిల్‌ అంతర్గత డిజైన్‌ల ఆధారంగా మ్యాక్‌రూమర్స్‌ (MacRumors) అనే వెబ్‌సైట్‌ ఐఫోన్ 16,  ప్రో,  ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్‌అప్‌లను రూపొందించింది. వీటి ప్రకారం..  యాపిల్‌ తదుపరి తరం వేరియంట్‌లు పెద్ద డిస్‌ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

ఐఫోన్ 16 వేరియంట్‌​ డిస్‌ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్‌ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్‌లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్‌లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్‌లలో టెలిఫోటో లెన్స్‌లను చూడొచ్చని భావిస్తున్నారు.

డిజైన్‌ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్‌లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్‌లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్‌మెంట్‌ ఉంటుంది కానీ యాడెడ్‌ బటన్‌తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement