పీబీ మనీకి ఓబీపీపీ లైసెన్స్ మంజూరు | PB Money Secures SEBI OBPP License, Key Details For Retail Bond Investors And What It Means, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

పీబీ మనీకి ఓబీపీపీ లైసెన్స్ మంజూరు

Oct 14 2026 3:09 PM | Updated on Oct 14 2026 3:15 PM

PB Money Secures SEBI OBPP License know details Retail Bond Investors

దేశ ఆర్థిక రంగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సులభతరమైన పెట్టుబడి అవకాశాలను అందించేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పైసాబజార్‌తో భాగస్వామ్యం కలిగిన ‘పీబీ మనీ’కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ‘ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్’ (ఓబీపీపీ) లైసెన్స్ లభించింది. ఈ లైసెన్స్‌ ద్వారా రిటైల్ మదుపరులకు బాండ్ మార్కెట్‌ను మరింత చేరువ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు

ఈ కొత్త లైసెన్స్‌తో పీబీ మనీ సంస్థ బాండ్లలో పెట్టుబడులు పెట్టే కస్టమర్ల ప్రయాణాన్ని పూర్తిగా స్వయంగా నిర్వహించనుంది. ఇన్వెస్టర్ల ఆన్‌బోర్డింగ్, కేవైసీ ప్రక్రియ నుంచి మొదలుకుని, బాండ్ల అన్వేషణ, ఆర్డర్ ప్లేస్‌మెంట్, చెల్లింపుల సమన్వయం, పెట్టుబడి అనంతర సేవల వరకు అన్నింటినీ ఈ వేదిక చూసుకుంటుంది. పైసాబజార్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత కస్టమర్ వర్గాలు పైసాబజార్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

రిటైల్ రంగానికి సరికొత్త ఆదాయ మార్గం

సాధారణంగా బాండ్లు రిటైల్ ఇన్వెస్టర్లలో ఇంకా పూర్తిస్థాయిలో ప్రాచుర్యం పొందలేదు. అయితే ఇవి క్రమబద్ధమైన వడ్డీ ఆదాయాన్ని అందించడంతో పాటు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవడానికి (డైవర్సిఫికేషన్) ఎంతో దోహదపడతాయి. పెట్టుబడి ప్రక్రియపై పూర్తి నియంత్రణను కలిగి ఉండటం ద్వారా వినియోగదారులు బాండ్లను సులభంగా అర్థం చేసుకోవడానికి, అన్వేషించడానికి, పెట్టుబడులు పెట్టడానికి పీబీ మనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా పీబీ మనీ డైరెక్టర్, పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ మాట్లాడుతూ..‘వినియోగదారుల మారుతున్న ఆర్థిక అవసరాలను తీర్చడమే మా ప్రధాన ధ్యేయం. ఇందులో పెట్టుబడులు కీలకమైన భాగం. పీబీ మనీకి వచ్చిన ఓబీపీపీ లైసెన్స్ ద్వారా కస్టమర్లకు బాండ్ల పెట్టుబడి ప్రయాణం మరింత సులభతరమవుతుంది’ అన్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్‌.. ఇదే మంచి ఛాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement