
ఉద్యోగం దొరక్క కొంతమంది బాధపడుతుంటే.. ఉన్న ఉద్యోగంలో ఇమడలేక కొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం ఒక నెల తరువాత ఒక ఉద్యోగి రాజీనామా చేసిన సంఘటన సోషక్ నీడియాలో వైరల్ అవుతోంది.
హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్ ప్రియవర్షిణి చేసిన లింక్డ్ఇన్ పోస్టులో.. ఉద్యోగంలో చేరిన ఒక నెల తర్వాత రాజీనామా చేసిన ఉద్యోగి గురించి వెల్లడించింది. ఉదయం 10:00 గంటలకు జీతం అందుకున్న ఉద్యోగి.. తన రాజీనామాను ఉదయం 10:05 గంటలకు ఈమెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడించింది. ఇటువంటి చర్య మంచిదేనా?, ఇది న్యాయంగా ఉందా? అంటూ హెచ్ఆర్ ప్రశ్నించారు.

నువ్వు ఇక్కడే ఉండాలి అనుకోకపోతే.. ఉద్యోగంలో ఎందుకు చేరాలి?, ప్రాసెస్ ప్రక్రియలను ఎందుకు పూర్తి చేయాలి?, ట్రైనింగ్ సమయంలో ఎందుకు మౌనంగా ఉండాలి? అని కూడా హెచ్ఆర్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక
జీతం వచ్చిన వెంటనే.. రాజీనామా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం.. జవాబుదారీతనం లేకపోవడం అని కొందరు చెబుతున్నారు. ఆకస్మికంగా ఉద్యోగానికి రాజీనామా చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఇంకొందరు చెబుతుంటే.. ఉద్యోగం నచ్చలేదేమో అని మరికొందరు సమర్థిస్తున్నారు.