
భారత్‌లోకి తిరిగి ప్రవేశించిన ఒలింపస్
స్మార్ట్‌ఫోన్ల నుంచి పోటీ ఉన్నా ప్రఖ్యాత జపనీస్ కెమెరా తయారీ కంపెనీ ఓఎం సిస్టమ్(గతంలో ఒలింపస్) భారత మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అవుట్‌డోర్ ఫొటోగ్రాఫర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త శ్రేణి ఉత్పత్తులను ప్రారంభించే ప్రణాళికలతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారత్‌లో ఫొటోగ్రఫీ మార్కెట్‌లో తిరిగి తన వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. కంపెనీ తీసుకురాబోయే కెమెరా ఉత్పత్తులు ముఖ్యంగా వన్యప్రాణుల ఫొటోలు, ప్రయాణాలు, కంటెంట్ క్రియేటర్లకు ఎంతో తోడ్పడుతాయని స్పష్టం చేసింది.
ఓఎం సిస్టమ్ వేగంగా విస్తరిస్తున్న బహిరంగ ఫొటోగ్రఫీ విభాగంపై దృష్టి సారించింది. అందులో భాగంగా తాజాగా ఓఎం-5 మార్క్ 2 మిర్రర్ లెస్ కెమెరా, ఎం-జుయికో డిజిటల్ ఈడీ 50-200ఎంఎం F2.8 IS PRO లెన్స్‌తోపాటు, అవుట్‌డోర్ ఫొటోగ్రఫీ కోసం ప్రీమియం ఇమేజింగ్ ఉత్పత్తులను అందించే దిశగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఏపీఏసీ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ హండూ ఒక ప్రకటనలో మాట్లాడుతూ..‘వినియోగదారులకు ఫొటోగ్రఫీ పట్ల లోతైన అభిరుచి ఏర్పడుతున్నప్పడు సహజంగా స్మార్ట్‌ఫోన్లలోని పరిమితులను అధిగమించి కెమెరాలను ఎంచుకుంటారు. ఓఎం సిస్టమ్ అధునాతన ఆప్టిక్స్, క్లాస్-లీడింగ్ స్టెబిలైజేషన్, వినూత్న డిజైన్లతో ఉత్పత్తులను అందిస్తుంది’ అన్నారు.
ఇదీ చదవండి: బిగ్‌రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్!