Ola S1 Air First Scooter With Employee's Signatures and Dog - Sakshi
Sakshi News home page

Ola S1 Air: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Aug 7 2023 12:53 PM | Updated on Aug 7 2023 1:47 PM

ola S1 Air first scooter with employees signatures and dog - Sakshi

Ola Electric New Employee: భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ 'ఓలా' మార్కెట్లో పొందుతున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో మంచి అమ్మకాలను పొందింది. అయితే తాజాగా ఎస్1 స్కూటర్ ఉత్పత్తి నిలిపి వేసి ఆ స్థానంలో ఎస్1 ఎయిర్ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పితూ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది.

కొత్త ఉద్యోగి..
ఓలా ఎస్1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ మీద కంపెనీ ఉద్యోగులు సంతకాలు చేశారు. కానీ ఇటీవల ఉద్యోగిగా నియమితమైన 'బిజిలీ' (కుక్క) మాత్రం సంతకం చేయకుండా సీటుపై కూర్చుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సంస్థ సీఈఓ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఎస్1 ఎయిర్ స్కూటర్ కోసం బుకింగ్స్ చేసుకుంటున్నారు. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ. 85099 నుంచి రూ. 1.1 లక్షల మధ్య ఉండనుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్కూటర్ ధర ఈ నెల 15 తరువాత రూ. 10వేలు వరకు పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!

ఇక బిజిలీ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులకు ముందు కంపెనీ సీఈఓ కుక్కకు ఉద్యోగం కల్పిస్తూ దానికి ఐడీ కార్డుని కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement