ఒకే వేదికపై భారతీయ పాటలు, కళలు, వంటలు..మరెన్నో | NMACC India Weekend shaping up to dazzling cultural showcase | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై భారతీయ పాటలు, కళలు, వంటలు..మరెన్నో

Jun 27 2025 11:34 AM | Updated on Jun 27 2025 12:53 PM

NMACC India Weekend shaping up to dazzling cultural showcase

ఎన్‌ఎంఏసీసీ వీకెండ్‌

భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్‌ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్‌ఎంఏసీసీ.ఇండియావికెండ్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్‌ 10 బ్రాండ్లు

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ మ్యూజికల్‌: సివివైజేషన్‌ టు నేషన్‌’ ఈవెంట్‌లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. ఈ ఈవెంట​్‌కు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement