
దాదాపు రూ.19,650 కోట్లతో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం) ప్రారంభించనున్నారు. ముంబైకి కనెక్టివిటీని పెంచేందుకు, ప్రస్తుత విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని గ్లోబల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఐఏటీఏ తెలిపింది. దీనితో భారత ఎకానమీకి కూడా గణనీయంగా లబ్ధి చేకూరుతుందని వివరించింది.
భారత ఏవియేషన్ ప్రస్తానంలో నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఐఏటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ (ఏషియా–పసిఫిక్) షెల్డన్ హీ తెలిపారు. తొలి దశలో ఏటా 2 కోట్ల మంది ప్యాసింజర్ల హ్యాండ్లింగ్ సామర్థ్యంతో, ఎయిర్‌పోర్టులో ఒక టర్మినల్, ఒక రన్‌వే ఉంటాయి. దేశీయంగా మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాక్సీతో కనెక్ట్ అయిన విమానాశ్రయం ఇదే అవుతుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!