‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్‌ గోయల్‌.. ప్రధాని మోదీ ట్వీట్‌ వైరల్‌ | PM Modi Praise For Zomato CEO Deepinder Goyal, Says Surname Doesn't Matter In Today's India | Sakshi
Sakshi News home page

‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్‌ గోయల్‌.. ప్రధాని మోదీ ట్వీట్‌ వైరల్‌

Published Wed, May 22 2024 10:55 AM

Modi Praise On Zomato Ceo Deepinder Goyal

జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ స్టార్టప్‌ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు.  

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో దీపిందర్‌ గోయల్‌ స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.

నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?
‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్‌ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని
విశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్‌ గోయల్‌ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.

మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం
‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement