ఎల్‌ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్‌ ఫండ్‌ | LIC Mutual Fund launches Manufacturing Fund | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్‌ ఫండ్‌

Sep 23 2024 8:36 AM | Updated on Sep 23 2024 8:36 AM

LIC Mutual Fund launches Manufacturing Fund

ముంబై: ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్‌ ఫండ్‌’ను ప్రారంభించింది. అక్టోబర్‌ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్‌ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, మెటల్స్, షిప్‌ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.

ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్‌ఎఫ్‌వో) వివరాలను ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్‌ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్‌ ఫండ్‌ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్‌ చేసుకోవచ్చని తెలిపారు.

‘‘ఈ పథకం అక్టోబర్‌ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్‌ రూ.100కు, నెలవారీ సిప్‌ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్‌ ఫండ్స్‌ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement