దేశంలో అత్యంత విలువైన సంస్థగా ఎల్‌ఐసీ

Lic Becomes 5th Most Valued Company In India - Sakshi

ప్రముఖ జీవిత బీమా ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది.

ఎల్‌ఐసీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది.
 
ఇక మార్కెట్ క్యాప్ చార్ట్‌లో అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,టాటా కన్సల్టెన్సీ సర్వీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత విలువైన కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఎల్‌ఐసి అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. 
 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top