
అక్టోబర్ 1తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి సంబంధించి, పబ్లిక్ ప్రావి డెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌తో పాటు వివిధ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దీనితో వరుసగా ఏడు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగించినట్లవుతుంది.
నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి స్కీమ్‌లో డిపాజిట్లపై 8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లు.. పీపీఎఫ్‌పై 7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై 4%, కిసాన్ వికాస పత్రపై 7.5%, ఎన్‌ఎస్‌సీపై 7.7% వడ్డీ రేట్లు ఉంటాయి. కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది.
ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే