ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గులు, జీవితంలో ఎదురయ్యే దీర్ఘకాలిక లక్ష్యాల (రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహం వంటివి) మధ్య సాధారణ ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెంపుచేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థిరమైన రాబడినేచ్చే పథకాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ పథకాలు పూర్తిగా ప్రభుత్వ హామీతో ఎలాంటి రిస్క్ లేకుండా 7-8% వరకు వడ్డీ రేట్లు అందిస్తాయి. అందులో కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.
ఈ పథకాల వడ్డీ రేట్లు 2025లో క్వార్టర్లవారీగా సమీక్షిస్తున్నప్పటికీ, ఆర్‌బీఐ విధానాల మార్పులకు అనుగుణంగా రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. పీపీఎఫ్, ఎస్‌ఎస్‌వై వంటివి దీర్ఘకాలిక భద్రతకు ఉపయోగపడగా, ఎన్‌పీఎస్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌తో ఎక్కువ లాభాలు ఇస్తుంది. గత దశాబ్దంలో ఈ పథకాలు ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించాయి.
| పథకం | లక్ష్యం | వడ్డీ రేటు (ఏటా) | వ్యవధి | ప్రయోజనాలు |
|---|---|---|---|---|
| పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) | దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, రిటైర్మెంట్ | 7.1% | 15 సంవత్సరాలు | పూర్తి పన్నుమినహాయింపు, రిస్క్ ఫ్రీ, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకం. |
| నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) | రిటైర్మెంట్ పెన్షన్ | 10-12% (మార్కెట్-లింక్డ్) | 60 సంవత్సరాల వయసు వరకు | ఈక్విటీ/ డెట్ మిక్స్, 80C + అదనపు రూ.50,000 మినహాయింపు. యువతకు ఉపయోగకరం. |
| సుకన్యా సమృద్ధి యోజన (SSY) | ఆడపిల్లల విద్య/వివాహం | 8.2% | 21 సంవత్సరాలు | పూర్తి పన్నుమినహాయింపు, మహిళా సాధికారతకు ప్రోత్సాహం. |
| సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) | వృద్ధులకు ఆదాయం | 8.2% (క్వార్టర్లీ) | 5 సంవత్సరాలు | 60+ వయసు, 80C మినహాయింపు |
| కిసాన్ వికాస్ పత్రా (KVP) | మధ్యస్థ/దీర్ఘకాలిక పెట్టుబడి | 7.5% | 9 సంవత్సరాలు 5 నెలలు (డబుల్ అవుతుంది) | గ్రామీణ ప్రజలకు ఉపయోగం |
| నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) | మధ్యస్థ పెట్టుబడి | 7.7% | 5 సంవత్సరాలు | 80C మినహాయింపు |
| అటల్ పెన్షన్ యోజన (APY) | అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రిటైర్మెంట్ | రూ1,000-5,000/నెల పెన్షన్ | 60 సంవత్సరాల వయసు | 18-40 సంవత్సరాల వారు దరఖాస్తు చేయాలి. గ్యారంటీడ్ పెన్షన్. |
ప్రస్తుతం వాటిలో పెట్టుబడి పెట్టే మార్గాలు
ఆధార్, పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్‌తో కేవైసీ పూర్తి చేస్తే చాలు పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ మార్గం (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్)
ఆఫ్‌లైన్: సమీప పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి సంబంధిత ఫామ్ (ఉదా., పీపీఎఫ్‌కు Form-1, ఎస్‌ఎస్‌వైకు Form-4) సమర్పించాలి.
ఆన్‌లైన్: పోస్ట్ ఆఫీస్ ఐపీపీబీ యాప్ లేదా వెబ్‌సైట్ (indiapost.gov.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో వీటిని ప్రారంభించవచ్చు.
బ్యాంకింగ్ మార్గం
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో యాకౌంట్ తెరిచి నెట్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్/ ఎన్‌ఎస్‌సీ వంటి వాటిలో పెట్టుబడి చేయవచ్చు.
ఇదీ చదవండి: వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’


