breaking news
Fixed income
-
ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?
స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు. దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్డ్, ఫ్లోటింగ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ అని పలు రకాలున్నాయి. గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.యాన్యుటీ ప్లాన్లుపెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఎల్ఐసీ నుంచి జీవన్ శాంతి, జీవన్ అక్షయ్ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్ శాఖల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు)బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్ క్యుములేటివ్)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్ పరంగా చూస్తే.. బ్యాంక్ ఎఫ్డీలకు ఆర్బీఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం.మంత్లీ ఇన్కమ్ ప్లాన్లుమ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.కార్పొరేట్ డిపాజిట్లునాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల(నాన్ క్యుములేటివ్)లో ఇన్వెస్ట్ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్ రేటెడ్ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్ కలిగిన సంస్థలు.సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది. మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ ల్యాడర్ పోర్ట్‌ఫోలియో వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి. పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్ పీ2పీ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి. వీటిని గమనించాలి..→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. → రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్
ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశాడు రియల్ హీరో సోనూ సూద్. ఈ ప్రమాదం చాలా దారుణమని ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ద్వారా సందేశాన్ని కూడా పంపించాడు. రియల్ హీరో... ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే సోనూ సూద్ ఇప్పుడు రైలు ప్రమాద బాధితుల పక్షాన నిలిచి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. బాధిత కుటుంబాలకు కంటితుడుపు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా శాశ్వత పరిహారం చెల్లించే విధంగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బాలాసోర్ రైలు ప్రమాదంపై తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. ఒడిశాలో జరిగిన విషాదం గురించి తెలియగానే నా గుండె చెక్కలైంది. ప్రమాద బాధితులకు నా ప్రగాఢ సానుభూతులు తెలుపుతున్నాను. మనమందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని రాస్తూనే... వీడియో ద్వారా సందేశాన్ని పంపించాడు. వీడియోలో సోనూ ఏమన్నాడంటే... మనం ఈరోజు ప్రమాదం గురించి ట్వీట్ చేస్తాం, సంఘటనలో నష్టపోయిన నిర్భాగ్యుల పట్ల సానుభూతి తెలుపుతాం. కానీ వెంటనే మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. కానీ వీరిలో జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటున్న వారి పరిస్థితి ఏమిటి? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? రాత్రికి రాత్రి చాలా కుటుంబాలు చెదిరిపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడే అవకాశముందా? ఇప్పుడు ప్రకటించిన నష్టపరిహారం రెండు మూడు నెలల్లో ఖర్చయిపోతుంది. ఈ ఘటనలో తమ కుటుంబాలను పోషించుకునే అనేకమంది కాళ్ళు, చేతులు విరిగిపోయాయి. ఈ పరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా? ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే కానీ ఇటువంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఎదో నష్టపరిహారం ప్రకటించి ఊరుకోకుండా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పెన్షన్లు ఇవ్వడంగానీ స్థిరాదాయం కల్పించడం గానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునరాలోచన చేసి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు భరోసా కల్పించాలి. అలాగే ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences 💔🙏 Time to show our support and solidarity for the unfortunates. 💔#OdishaTrainAccident 🇮🇳 pic.twitter.com/ZfuYYp8HK9 — sonu sood (@SonuSood) June 3, 2023 ఇది కూడా చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను వెంటాడిన విధి.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత.. -
ఇక డివిడెండ్ షేర్లపై దృష్టి పెట్టవచ్చా?
కోవిడ్-19 ధాటికి మార్చిలో కుదేలైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి ఒక్కసారిగా జోరందుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలతో వ్యవస్థలో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీంతో చౌక నిధులు మార్కెట్లలోకి ప్రవహిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని బ్లూచిప్ కంపెనీలు సానుకూల ఫలితాలు సాధించడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు తెలియజేశారు. ఇటీవల డిజిటల్, టెలికం విభాగం రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించింది. తద్వారా ఫేస్‌బుక్‌సహా పలు విదేశీ దిగ్గజాలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులకు క్యూకట్టడంతో టెలికం రంగ కంపెనీలకు జోష్‌వచ్చినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అంతర్గతంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక డివిడెండ్లు చెల్లించే బలమైన కంపెనీలవైపు కొంతవరకూ దృష్టిసారించవచ్చని తెలియజేస్తున్నారు. వివరాలు చూద్దాం.. ఫిక్స్డ్ కంటే అధికం ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపుగా 4-6 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే పటిష్ట ఫండమెంటల్స్ కలిగి అధిక డివిడెండ్లు పంచే కంపెనీలు ఇంతకంటే అధిక రిటర్నులు అందించగలవని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో అమలైన డివిడెండ్ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే ప్రస్తుతం వీటిని అందుకునే వాటాదారులు, ఇన్వెస్టర్లపై పన్ను పడుతోంది. డివిడెండ్ మొత్తం రూ. 5000 మించితే కంపెనీలు మూలం వద్దే పన్ను(టీడీఎస్) విధిస్తాయి. దేశీ ఇన్వెస్టర్లపై 10 శాతం, ఎన్ఆర్ఐలపై 20 శాతం చొప్పున డివిడెండ్లపై పన్ను విధింపు ఉంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇలా చూస్తే కొన్ని కంపెనీలు చెల్లించే డివిడెండ్లు బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లకంటే అధిక ఈల్డ్స్(రిటర్నులు) అందించగలవని అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాలన్స్‌షీట్, పటిష్ట ఫండమెంటల్స్ కలిగిన కొన్ని కంపెనీలు అధిక డివిడెండ్లను చెల్లిస్తుంటాయని.. ఇలాంటి కౌంటర్లవైపు కొంతమేర పెట్టుబడులను మళ్లించవచ్చని సూచిస్తున్నారు. పీఎస్‌యూలు నిజానికి పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్లను పంచుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్, కంకార్, ఆర్ఈసీ తదితర దిగ్గజాలు భారీ డివిడెండ్లను చెల్లించినట్లు తెలియజేశారు. ప్రయివేట్ రంగంలో సాధారణంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఎంఎన్‌సీలు అధిక డివిడెండ్లను ప్రకటిస్తుంటాయని పేర్కొన్నారు. అయితే గతంతో భవిష్యత్‌ను పోల్చతగదని.. ఇకపై కోవిడ్-19 పరిస్థితుల్లోనూ అధిక డివిడెండ్లను పంచగల సత్తా తక్కువ కంపెనీలకే ఉంటుందని తెలియజేశారు. లాక్‌డవున్, ఆర్థిక మందగమనం, డిమాండ్ క్షీణత తదితర ప్రతికూలతలతో పలు రంగాల కంపెనీలకు పెట్టుబడుల అవశ్యకత పెరుగుతుందని, దీంతో డివిడెండ్ చెల్లింపులు తగ్గే వీలున్నదని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ వివరించారు. ఐటీ కంపెనీలు సైతం నగదును డివిడెండ్, బైబ్యాక్‌ల నుంచి ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు వేస్తున్న అంశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఐటీసీ భళా వడ్డీ రేట్లు, మార్కెట్ అనిశ్చితులు వంటి అంశాలను పరిగణిస్తే.. 4-6 శాతం డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీలలో పెట్టుబడులు తెలివైన నిర్ణయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయివేట్ రంగంలో ఇటీవల ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు వెల్లడిస్తూ.. వాటాదారులకు షేరుకి రూ. 10.15 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది 5 శాతం ఈల్డ్‌కు సమానంకాగా.. గత రెండు నెలల్లో ఐటీసీ షేరు 17 శాతం ర్యాలీ చేసింది. అధిక ఈల్డ్స్ ఇలా గతేడాది అధిక డివిడెండ్లు పంచిన కంపెనీలలో ఎస్కేఎఫ్, హడ్కో, బామర్ లారీ, ఆర్సీఎఫ్ తదితరాలు చోటుచేసుకున్నాయి. ఎస్కేఎఫ్ దాదాపు 8 శాతం డివిడెండ్ ఈల్డ్ అందించగా.. హడ్కో, బామర్ లారీ, ఆర్సీఎఫ్, హెచ్ఎస్ఐఎల్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఆన్‌మొబైల్ గ్లోబల్, టిమ్కెన్ ఇండియా 7-5 శాతం మధ్య డివిడెండ్ రిటర్నులు ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర కౌంటర్లలో కొచిన్ షిప్‌యార్డ్, జీఎండీసీ వంటి కంపెనీలు సైతం 5 శాతం ఈల్డ్‌కు కారణమైనట్లు తెలియజేశారు. అయితే భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు ప్రకటించగల రంగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవలసి ఉంటుందని ప్రభాకర్ సలహా ఇస్తున్నారు. -
దేన్లోనైతే ‘ఫండు’తుంది?
- ఇన్కమ్ ఫండ్స్‌తో స్థిర ఆదాయం - ఈక్విటీ ఫండ్స్‌లో రిస్కూ, రాబడి.. రెండూ ఎక్కువే - బ్యాలెన్స్డ్ ఫండ్స్‌తో భరోసా (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) ప్రతి వ్యక్తికీకొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. అయినా బాగా డబ్బు సంపాదించాలని, అన్నీ సమకూర్చుకోవాలని ఉండనిదెవరికి చెప్పండి!? అందుకే చక్కని రాబడి కోసం పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులన్నిటి వెనకా బలమైన అవసరం ఉంటుంది. ఇక మ్యూచ్‌వల్ ఫండ్స్ విషయానికొస్తే ఈ అవసరాలకు అనుగుణంగానే కాకుండా... పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి రకరకాల పథకాలను తెస్తున్నాయి. కాకపోతే వీటిలో ఇన్వెస్ట్ చేసే వారు రిస్క్ కూడా భరించాల్సి ఉంటుంది. సరే! రిస్క్ భరిస్తాం కానీ, ఏ ఫండైతే బెటర్ అంటారా...! ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఫండ్స్‌పై కొంత అవగాహన ఉండాలి. అందుకే... ఎలాంటి ఫండ్స్ ఉంటాయి? ఏవి ఎవరికి అనువుగా ఉంటాయి? అనేది తెలియజేసేదే ఈ కథనం... కాలం, ఇన్వెస్ట్మెంట్ విధానం వంటివి పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మూడు రకాలు. వాటిలో మొదటివి ఓపెన్ ఎండెడ్ కాగా రెండోవి క్లోజ్డ్ ఎండెడ్. ఇక మూడోవి ఇంటర్వల్ స్కీమ్స్. 1. ఓపెన్-ఎండెడ్ స్కీమ్స్ అంటే ఈ పథకాల్లో ఎప్పుడైనా చేరొచ్చు. ఎప్పుడైనా నిష్ర్కమించవచ్చు. ఇవి ఎప్పుడూ ఇన్వెస్ట్మెంట్లకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయన్న మాట. నిజానికి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌దే అధిక వాటా. ఇవి మన అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైనా కొనటం, ఎప్పుడైనా విక్రయించటం చేయగలిగే ఈ రకం ఫండ్స్ ముఖ్య లక్ష్యం... అధిక లిక్విడిటీయే. 2. క్లోజ్డ్-ఎండెడ్ స్కీమ్స్ ఇవి ఓపెన్ ఎండెడ్ వంటివి కాదు. ఈ ఫండ్స్‌లో ఎప్పుడు పడితే అప్పుడు చేరలేం. బయటకు రాలేం. వీటికొక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. వీటిని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) సమయంలో మాత్రమే కొనగలం. ఒక మ్యూచువల్ ఫండ్ ఏవైనా కొత్త పథకాన్ని ప్రకటించినప్పుడు ముందుగా ఎన్‌ఎఫ్‌ఓకు వస్తుంది. అప్పుడే మనం ఆ ఫండ్స్‌ను కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది ముగిస్తే.. తర్వాత కొనడానికి ఆస్కారం లేదు. మళ్లీ ఎన్ఎఫ్ఓ వచ్చే వరకు ఆగాల్సిందే. 3. ఇంటర్వల్ స్కీమ్స్ ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్... రెండింటి లక్షణాలూ ఈ ఇంటర్వెల్ స్కీమ్స్‌లో ఉన్నాయి. ఈ ఫండ్స్ యూనిట్లను నిర్ణయించిన వ్యవ ధిలో సంబంధిత ఎన్ఏవీ ధ ర వద్ద కొనుగోలు చేయవచ్చు లేదా స్టాక్ మార్కెట్లోనో, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. పెట్టుబడి, రాబడి, రిస్క్ తదితర అంశాల పరంగా మ్యూచువల్ ఫండ్స్ 4 రకాలు 1. గ్రోత్/ ఈక్విటీ స్కీమ్స్: మనం పెట్టిన పెట్టుబడిని పెంచటమే లక్ష్యంగా పనిచేసేవి ఈక్విటీ ఫండ్స్. ఈ ఫండ్స్ మన పెట్టుబడులను ఎక్కువగా ఈక్విటీ మార్కెట్లో పెడతాయి. ఈ స్కీమ్స్‌లో డివిడెండ్, మూలధన పెరుగుదల తదితర ఆప్షన్స్ ఉం టాయి. ఇన్వెస్టర్లు వారికి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్ ఎంచుకున్న వారు అధిక రిస్క్‌కు సిద్ధపడాలి. ఎందుకంటే స్టాక్‌మార్కెట్లు స్థిరంగా ఉండవు కదా!! దీర్ఘకాలంలో ప్రయోజనాలను ఆశించి, ఇన్వెస్ట్ చేసే వారికి ఈ గ్రోత్/ఈక్విటీ స్కీమ్స్ అనువైనవి. 2. ఇన్కమ్/డెట్ స్కీమ్స్ ఈ ఫండ్స్ నిరంతర, స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఇవి మన డబ్బుల్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అయి న బాండ్లు, కార్పొరేట్ డి బెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ తక్కువ. కాకపోతే మన పెట్టుబడి పెరగటానికి ఉన్న అవకాశాలూ పరిమితమే. ఈ ఫండ్స్‌కు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇలాంటి వాటి వల్ల ఎలాంటి భయం అవసరం లేదు. నిరంతర, స్థిర ఆదాయాన్ని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. 3. బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఒకవంక నిరంతర ఆదాయంతోపాటు మరోవంక మూలధన పెరుగుదలనూ అందించే ఫండ్స్ ఇవి. ఈ ఫండ్స్ మన డబ్బును కొంత ఈక్విటీ మార్కెట్లలోను, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక మోస్తరు ఆదాయ వృద్ధిని కోరుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రిస్క్ పరిమితం. 4. మనీ మార్కెట్/లిక్విడ్ స్కీమ్స్ ఇవి కూడా ఇన్కమ్ ఫండ్స్ లాంటివే. మన డబ్బుల్ని ఇవి ట్రెజరీ బిల్స్, డిపాజిట్ పత్రాలు, వాణిజ్య పత్రాలు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తదితర సాధానాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిలో రిస్క్ తక్కువ. తక్కువ కాలంలో బ్యాంకు వడ్డీతో పోలిస్తే కాస్త అధిక వడ్డీని ఆశించే వారికి, కార్పొరేట్, సాధారణ ఇన్వెస్టర్లకు ఇవి అనువుగా ఉంటాయి.