ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు | Key Highlights Of Direct Tax Collections Show Strong Growth And Reach ₹12.92 Lakh Crore In 2025-26 | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు

Nov 12 2025 8:20 AM | Updated on Nov 12 2025 10:30 AM

Key Highlights of Direct Tax Collections FY 2025 26 up to Nov 10

ప్రత్యక్ష పన్ను వసూళ్లు బలంగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 10 వరకు రూ.12.92 లక్షల కోట్ల నికర పన్ను వసూలైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.12.08 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం పెరిగింది.

కార్పొరేట్‌ పన్ను రూపంలో నికరంగా రూ.5.37 లక్షల కోట్లు వచ్చింది. క్రితం ఆర్థిక సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో వచ్చిన మొత్తం రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో రిఫండ్‌లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 18% తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2025–26 మొత్తం మీద రూ.25.2 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో సమకూరుతుందని కేంద్ర సర్కారు బడ్జెట్‌లో అంచనా వేసింది.

ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement