Justin Bieber X Vespa special edition scooter launched in India: Details - Sakshi
Sakshi News home page

పాప్‌ స్టార్‌ బీబర్‌ స్పెషల్‌ స్కూటర్‌.. ధర రూ. 6.45 లక్షలు!

Aug 18 2023 9:21 AM | Updated on Aug 18 2023 10:02 AM

Justin Bieber X Vespa special edition scooter launched in India - Sakshi

ముంబై: వెస్పా స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో వెహికల్స్‌ తాజాగా జస్టిన్‌ బీబర్‌ ఎక్స్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ ధర రూ. 6.45 లక్షల నుంచి (ఎక్స్‌ షోరూమ్‌). కెనడాకు చెందిన పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ పేరిట ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ మోడల్స్‌ను (పది లోపే) ప్రీ–ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇవి పూర్తిగా అసెంబుల్‌ చేసిన యూనిట్‌గా దిగుమతి అవుతాయి. 150 సీసీ ఇంజిన్‌తో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఉంటుందని పియాజియో వెహికల్స్‌ సీఎండీ డీగో గ్రాఫీ తెలిపారు. 
జస్టిన్ బీబర్ రూపొందించిన కొత్త వెస్పా వైట్ కలర్ ఆప్షన్‌లో మోనోక్రోమ్ స్టైల్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులోని శాడిల్, గ్రిప్స్, రిమ్స్ స్పోక్స్ వంటి ఎలిమెంట్స్ అన్నీ వైట్‌లోనే ఉన్నాయి. బ్రాండ్ లోగో, వెహికల్‌ బాడీపై ఫ్లేమ్స్ కూడా టోన్-ఆన్-టోన్ తెలుపు రంగులో ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement