జీప్ రాంగ్లర్ కొత్త ఎడిషన్‌ లాంచ్‌.. అన్నీ సేల్‌! | Jeep Wrangler Whitecap Mojito Limited Edition Launched India | Sakshi
Sakshi News home page

జీప్ రాంగ్లర్ కొత్త ఎడిషన్‌ లాంచ్‌.. అన్నీ సేల్‌!

Oct 14 2026 5:19 PM | Updated on Oct 14 2026 5:29 PM

Jeep Wrangler Whitecap Mojito Limited Edition Launched India

జీప్ రాంగ్లర్ సరికొత్త ఎడిషన్‌ వైట్ క్యాప్ మొజిటో భారతదేశంలో విడులైంది. దీని ధరను రూ .73.55 లక్షలుగా(ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ స్పెషల్-ఎడిషన్ ఆఫ్-రోడర్ ధర.. దాని బేస్‌ వర్షన్‌ రాంగ్లర్ రూబికాన్ కంటే రూ .1.25 లక్షలు అధికం.

లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకువచ్చిన జీప్ రాంగ్లర్ వైట్ క్యాప్ మొజిటో వాహనాలను జీప్ సంస్థ భారత మార్కెట్‌కు కేవలం 25 యూనిట్లను మాత్రమే కేటాయించించగా అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. జీప్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 250 యూనిట్ల వైట్ క్యాప్ ఎడిషన్  వాహనాలను ఉత్పత్తి చేసింది. ఈ అక్టోబర్ చివరి నాటికి అధీకృత జీప్ డీలర్ షిష్‌ల ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయనుంది.

వైట్ క్యాప్ మోజిటో వాహనం బయట ప్రకాశవంతమైన గ్రీన్‌ 'మోజిటో' షేడ్‌తో పైన వైట్‌ టాప్‌తో వస్తుంది. ముందువైపు గ్రిల్ చుట్టూ వైట్‌ కలర్‌ అంచు ప్రత్యేక ఆకర్షణ. బూట్ మూతపై తెలుపు '4 వీల్ డ్రైవ్' స్టిక్కర్ కనిపిస్తుంది. ఫెండర్లు బాడీ కలర్‌లో ఉంటాయి. ఇంటీరియర్‌ విషయానికి వస్తే.. ప్రామాణిక రూబికాన్‌లో కంటే ఈ స్పెషల్ ఎడిషన్‌లో రెండు ఫీచర్లు మాత్రమే కొత్తగా వచ్చాయి. అవి ఇన్‌బిల్ట్‌ డాష్ క్యామ్, రీన్ఫోర్స్డ్ గ్రాబ్ హ్యాండిల్స్. మిగిలిన క్యాబిన్ లో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్, 12-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సబ్ వూఫర్ తో 9-స్పీకర్ ఆఫ్‌లైన్ సౌండ్ సిస్టమ్, 7-అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, ఆరు ఎయిర్ బ్యాగులు, ఎడిఎఎస్ సూట్ ఉన్నాయి.

ఇంజిన్‌ విషయంలో వైట్ క్యాప్ మొజిటో రూబికాన్ ను పోలి ఉంటుంది. ఇది 2.0-లీటర్, ఫోర్‌ సిలిండర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 272 బీహెచ్‌పీ పవర్‌, 400 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, స్టాండర్డ్ 4x4 సిస్టమ్‌తో వస్తుంది. రూబికాన్‌లో లాగే హెవీ-డ్యూటీ డానా యాక్సిల్స్, ఇంటిగ్రేటెడ్ ఆఫ్-రోడ్ కెమెరా, రీఇన్ఫోర్స్డ్ సస్పెన్షన్, రాక్ రైల్స్, 17-అంగుళాల చక్రాలపై 255-సెక్షన్ ఆఫ్-రోడ్ టైర్లు, హై-క్లియరెన్స్ ఫ్రంట్ ఫెండర్ ఫ్లేర్స్ వంటి ఆఫ్-రోడ్-ఫోకస్డ్ హార్డ్ వేర్‌లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement