ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. దేశీయ విఫణిలో ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19.95 లక్షలు. ఇది జీఎక్స్ ఫ్లీట్ 7 సీటర్, 8 సీటర్ ఎంపికలలో లభిస్తుంది. 8 సీటర్ ధర రూ. 19.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ 7-సీట్ల ఆప్షన్ కంటే రేటు రూ. 5,000 ఎక్కువ.
జీఎక్స్ ఫ్లీట్ 7-సీట్ల వేరియంట్‌లో కెప్టెన్ సీట్లు ఉంటాయి. జీఎక్స్ ఫ్లీట్ అనేది జీఎక్స్ ఎస్ఎల్ఎఫ్ గ్రేడ్ ఆధారంగా రూపొందించారు. కాగా టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్, జీఎక్స్ ప్లస్, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. లిమో ఎడిషన్ 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, దీనికి ప్రత్యేకంగా మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని పేర్కొనబడింది.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన బాడీ కలర్డ్ ORVMలు, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా ఏబీఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌లో పెట్రోల్ రేటు తగ్గుతుందా?


