breaking news
Innova Crysta
-
అందరికీ ఇష్టమైన కారు.. అమాంతం పెరిగిన ధరలు
జనవరి ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగానే.. టయోటా కంపెనీ తన ఇన్నోవా క్రిస్టా ధరలను సవరించింది. ధరల పెరుగుదల రూ.21,000 నుంచి రూ.33,000 మధ్య ఉంది.భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.ధరల పెరుగుదల తరువాత.. టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్లైన GX సెవెన్ & ఎనిమిది సీటర్ వేరియంట్ల ధర ఇప్పుడు రూ. 18.66 లక్షల నుంచి రూ. 18.99 లక్షలకు(ఎక్స్-షోరూమ్) చేరింది. GX+ సెవెన్ & ఎనిమిది సీటర్ మోడళ్ల ధర వరుసగా రూ. 20.47 లక్షలు & రూ. 20.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా వస్తుంది.ఏడు, ఎనిమిది సీట్ల VX మోడళ్ల ధరలు వరుసగా రూ. 23.95 లక్షలు & రూ. 24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్-ఎండ్ ZX ఏడు సీట్ల మోడల్ ధర ఇప్పుడు రూ. 25.27 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 25.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
ఇన్నోవా క్రిస్టాకు కౌంట్‌డౌన్!.. నిలిపివేతా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా క్రిస్టా కారును టయోటా కంపెనీ నిలిపివేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థ దీనిని 2027 నాటికి దశలవారీగా తొలగించనున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టయోటా కంపెనీ 2025లో మొదటిసారిగా.. తన ఇన్నోవా క్రిస్టా కారును దశలవారీగా తొలగించాలని ప్రణాళిక వేసింది, కానీ హైక్రాస్ ప్రవేశపెట్టిన తర్వాత.. కూడా క్రిస్టా ఉత్పత్తిని విస్తరించాలని నిర్ణయించుకుంది. అయితే కఠినమైన ఉద్గార నిబంధనలు కారణంగా.. దీనిని నిలిపివేసేందుకు ఇప్పుడు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కఠినమైన CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ) నిబంధనల ప్రకారం.. కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే జరిగితే.. చాలాకాలంగా ఆటోమొబైల్ మార్కెట్లో తన హవా కొనసాగించిన కారు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో కొత్త క్రిస్టా కారును కొనుగోలు చేయలేమని తెలుస్తోంది.ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే విక్రయిస్తోంది. ఇది 148 BHP & 343 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు డీజిల్ కార్ల విక్రయాలను తగ్గిస్తున్నాయి. ఇది కూడా టయోటా కంపెనీ తన క్రిస్టా కారును నిలిపివేయడానికి ఒక కారణం అని తెలుస్తోంది. -
ఇన్నోవా క్రిస్టాలో రెండు కొత్త గ్రేడ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఇన్నోవా క్రిస్టా వాహనానికి సంబంధించి రెండు టాప్ గ్రేడ్ల (జెడ్ఎక్స్, వీఎక్స్) ధరలను టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) ప్రకటించింది. ఇందులో జెడ్ఎక్స్ గ్రేడ్ ధర రూ. 25.43 లక్షలు కాగా, వీఎక్స్ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 23.79–23.84 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుందని తెలిపింది. వీటిలో 7 ఎయిర్బ్యాంగ్లు, ముందు..వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. దీనితో ప్రస్తుతం మొత్తం నాలుగు గ్రేడ్లలో (జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్) కొత్త ఇన్నోవా క్రిస్టా లభిస్తున్నట్లవుతుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. రూ. 50,000 చెల్లించి ఆన్లైన్లో లేదా డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్
న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన పాపులర్ మల్టీ–పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 2.4 లీటర్ల డీజిల్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వంటి ఫీచర్లతో లీడర్షిప్ ఎడిషన్ పేరిట దీనిని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీకేఎం సేల్స్ అండ్ సర్వీస్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ.. ‘ఎంపీవీ సెగ్మెంట్లో ఈ వాహనం 50 శాతం వాటాను కలిగిఉంది. ఇందుకు సంకేతంగా లీడర్షిప్ ఎడిషన్‌ను విడుదలచేశాం’ అని వ్యాఖ్యానించారు. -
ఇన్నోవా క్రిస్టాలో.. పెట్రోల్ వేరియంట్
న్యూఢిల్లీ : ‘టయోటా’ తన మల్టీపర్పస్ వెహికల్ ‘ఇన్నోవా క్రిస్టా’లో తాజాగా పెట్రోల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.13.73 లక్షలు-రూ.19.63 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాం తంలో విక్రయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ డీజిల్ 2.0 లీటర్, అంతకన్నా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యమున్న వెహికల్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2.7 లీటర్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ‘ఇన్నోవా క్రిస్టా’ పెట్రోల్ వెర్షన్ బుకింగ్స్‌ను నేటి నుంచి ప్రారంభించామని, వీటి డెలివరీ నెలాఖరు నుంచి ఉంటుందని కంపెనీ వివరించింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరి యంట్ లీటరుకు 9.89 కిలోమీటర్లు, ఇక ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 10.83 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయని పేర్కొం ది. ఇక డీజిల్ వేరియంట్ 2.4 లీటర్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్), 2.8 లీటర్ (6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని ధర రూ.13.84 లక్షలు-రూ.20.78 లక్షల (ఎక్స్‌షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. -
టయోటా.. కొత్త ఇన్నోవా క్రి స్టా
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు తన మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవాను అప్డేట్ చేసింది. కంపెనీ తాజాగా ‘ఇన్నోవా క్రిస్టా’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.13.84 లక్షలు- రూ.20.78 లక్షల (ఎక్స్ షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభ్యం కానున్నది. 2.8 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 14.29 కిలోమీటర్ల మైలేజ్‌ని, 2.4 లీటర్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ లీటరుకు 15.10 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ‘ఇన్నోవా క్రిస్టా’ ప్రధానంగా జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యంకానుంది. వీటి బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, డెలివరీ మే 13 నుంచి జరుగుతుందని కంపెనీ తెలిపింది.


