జావా కొత్త బైక్‌ 42 ఎఫ్‌జే | Jawa 42 FJ Launched In India, Check Its Price Details And Specifications Inside | Sakshi
Sakshi News home page

జావా కొత్త బైక్‌ 42 ఎఫ్‌జే

Sep 4 2024 2:33 AM | Updated on Sep 4 2024 1:00 PM

Jawa 42 FJ Launched In India At Rs 1. 99 Lakh

ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్‌ తాజాగా సరికొత్త జావా 42 ఎఫ్‌జే బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూం ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 42 సిరీస్‌లో ఇది మూడవ మోడల్‌. 334 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ 350 ఆల్ఫా2 ఇంజన్‌తో తయారైంది. స్లిప్, అసిస్ట్‌ క్లచ్‌తో 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ పొందుపరిచారు. ఎల్‌ఈడీ లైటింగ్, పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, యూఎస్‌బీ చార్జింగ్‌ పాయింట్‌ వంటి హంగులు జోడించారు. 

అక్టోబర్‌ 2 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా సీబీ350 ఆర్‌ఎస్‌కు పోటీనిస్తుంది. 2018 నవంబర్‌లో జావా బ్రాండ్‌ భారత్‌లో రీఎంట్రీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 450 డీలర్‌íÙప్స్‌ ఉన్నాయి. పండుగల సీజన్‌ నాటికి మరో 100 జావా కేఫ్స్‌ రానున్నాయి. జావా వంటి పునరుత్థాన బ్రాండ్‌ల పునర్నిర్మాణంలో ఎలాంటి సవాళ్లనైనా క్లాసిక్‌ లెజెండ్స్‌ ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement