ఐపీఎల్‌ 2023: ముంబై ఇండియన్స్‌ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?

IPL 2023 Nita Mukesh Ambani profits through Mumbai Indians  - Sakshi

 ఐపీఎల్‌ 2023,  ముంబై ఇండియన్స్‌ కథ కంచికే!

అయిదుసార్లు ఛాంపియన్‌ 2023 టైటిల్‌ పోరునుంచి ఔట్‌ 

టాప్‌ సక్సెస్‌ఫుల్‌ టీం ముంబైఇండియన్స్‌ ద్వారా అంబానీలకు భారీ ఆదాయం

ఐపీఎల్‌ 2023 పోరులో ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకునే చివరి అవకాశాన్ని చేజేతులారా జార విడిచుకుంది. ఆసియా కుబేరుడు  ముఖేశ్‌ అంబానీ సతీమణి, నీతా అంబానీ యాజమాన్యంలోని  ఐపీఎల్‌ జట్టు గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయాన్ని మూట గట్టుకుని టైటిల్‌ పోరును నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారవ సీజన్ ద్వారా అంబానీ కుటుంబం ఎంత ఆర్జించింది అనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. టాప్‌ సక్సెస్‌ఫుల్‌ టీంగా భావించే ముంబై ఇండియన్స్‌ ద్వారా  అంబానీలు ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేదే లేటెస్ట్‌ టాక్‌. (మరో 9 వేల మందికి పింక్‌ స్లిప్స్‌ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? )

ఐపీఎల్‌ టీం ముంబై ఇండియన్స్‌లో 100 శాతం వాటాతో నీతా, ముఖేష్ అంబానీలే ఏకైక యజమానులుగా ఉన్నారు. మిలియన్ల డాలర్లు 2008లో ఈ జట్టును కొనుగోలు చేశారు. తొలి సీజన్‌లో జట్టు కొనుగోలుకు రూ. 916 కోట్లు వెచ్చించారు.ఇప్పటివరకు ఐదు టైటిళ్లను సాధించి, 2023 వరకు అత్యధిక సంఖ్యలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను గెలుచుకుని ఆదాయం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గిందిలేదు.

పెద్ద సంఖ్యలో స్పాన్సర్‌లను పొందిన జట్టు కూడా ఇదే. ది ట్రిబ్యూన్ ప్రకారం, ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ రూ. 10,070 కోట్లకు పైమాటే. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ. 200 కోట్లుపెరిగింది. ఇప్పటివరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్‌.  కోవిడ్‌ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని  నమోదు చేసిన  ఏకైక జట్టు. (ఈస్ట్‌ హైదరాబాద్‌ రయ్‌ రయ్‌! ఎందుకో తెలుసా?)

దీంతోపాటు టిక్కెట్ ధరలతో పాటు మీడియా స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల సంపాదన కూడా భారీగానే ఉంది. ఇది అంతా ఒక  ఎత్తయితే మరో ప్రధాన ఆదాయ వనరు జియో సినిమాకు విక్రయించిన  ఐపీఎల్‌ హక్కుల ద్వారా ఆర్జించింది మరో ఎత్తు. తొలి ఐదు వారాల్లోనే జియోసినిమా రికార్డు స్థాయిలో 1300 కోట్ల వీడియో వీక్షణలను అందుకోవడం గమనార్హం. (Shantanu Narayen:189 బిలియన్‌ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన)

రిలయన్స్ బ్రాండ్ Viacom18, Jio సినిమా ఐపీఎల్‌ టెలికాస్టింగ్ హక్కులను రూ. 22,290 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు  జియో సినిమా ఐపిఎల్‌ని మొదటి హోస్ట్ చేయడం ద్వారా రూ. 23,000 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో వేల కోట్లను కూడా ఆర్జించనుందని అంచనా. దీంతో పాటు గ్లోబల్‌ ఫ్రాంచైజీల ద్వారా కూడా  భారీ ఆదాయాన్నే  సాధిస్తోంది రిలయన్స్‌.  

ఇదీ చదవండి: చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్‌

ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్‌ న్యూస్‌, బిజినెస్‌అప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షి బిజినెస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top