త్వరలో భారత మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌ | Sakshi
Sakshi News home page

త్వరలో భారత మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌

Published Thu, Feb 22 2024 9:14 AM

Indian Mobile Phone Brand Will Introduce Soon - Sakshi

దేశంలో భారీస్థాయిలో మొబైల్‌ ఫోన్ల తయారీని నెలకొల్పడంలో ఎన్నో విజయాలు సాధించినట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. ఆ క్రమంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్‌ తయారీరంగంలో దూసుకుపోతుందన్నారు. ఫోన్‌పే ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఇండస్‌ యాప్‌ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. 

భారత మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. త్వరలోనే రెండు లేదా మూడు సెమీకండక్టర్‌ ప్లాంట్లకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. ‘మొబైల్‌ ఫోన్ల తయారీతో పరిశ్రమలో విశ్వాసం నెలకొంది. ఈ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములు భారత్‌పై మొగ్గుచూపేలా కృషిచేసేలా చర్యలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లూ ఇదే ప్రయాణం కొనసాగుతుంది’అని చెప్పారు. దేశంలో సెమీకండ్టర్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి వచ్చే 20 ఏళ్ల కాలానికిగాను ప్రధాని మోదీ స్పష్టమైన కార్యాచరణ సూచించారని చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement