స్విస్‌ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బులు | Indian funds in Swiss Banks Falls | Sakshi
Sakshi News home page

స్విస్‌ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బులు

Jun 19 2026 7:58 AM | Updated on Jun 19 2026 10:28 AM

Indian funds in Swiss Banks Falls

న్యూఢిల్లీ/జ్యురిక్‌: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 2025లో 3.25 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులకు (రూ. 36,793 కోట్లు) తగ్గాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. లోకల్‌ శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలు ద్వారా వచ్చే నిధులు తగ్గడం ఇందుకు కారణం. అయితే, స్విట్టర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులు నేరుగా తమ ఖాతాల్లో వ్యక్తిగతంగా, సంస్థలపరంగా జమ చేసిన డిపాజిట్లు మాత్రం 50 శాతం పెరిగి 524 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులకు (సీహెచ్‌ఎఫ్‌) (సుమారు రూ. 6,000 కోట్లు) చేరాయి.

స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ)కి వివిధ బ్యాంకులు సమర్పించిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, ఇందులో ’నల్ల ధనం’, మరో దేశం ద్వారా భారతీయులు, ప్రవాస భారతీయులు.. స్విస్‌ బ్యాంకుల్లో ఎంత దాచుకుని ఉండొచ్చనే వివరాలు తెలియరాలేదు. 2024లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల మొత్తం నిధులు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్‌ సీహెచ్‌ఎఫ్‌కి చేరాయి. అంతకు ముందు 2021లో అత్యధికంగా 14 ఏళ్ల గరిష్ట స్థాయి 3.83 బిలియన్‌ సీహెచ్‌ఎఫ్‌కి పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement