
ప్రకటించిన కేంద్ర మంత్రి సింధియా
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ సేవల దిగ్గజంగా ఎదిగే దిశగా ఇండియా పోస్ట్ రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) ప్రాజెక్టును ఆవిష్కరించింది. ఏపీటీ ఆధారిత మౌలిక సదుపాయాలతో ఆధునిక లాజిస్టిక్స్ కంపెనీల్లాగా ఇండియా పోస్ట్‌కి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోస్ట్ చేశారు. డిజిటల్ లావాదేవీలను, ఏ బ్యాంకు కస్టమర్ల నుంచైనా యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సాంకేతిక అంశాల కారణంగా పోస్టాఫీసు సర్వీసులను కొనుగోలు చేయాలన్నా, ఇతర చెల్లింపులు జరపాలన్నా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల నుంచి మాత్రమే సాధ్యపడేది. ఎక్కడైనా సర్వీసులు అందించేందుకు, రియల్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని సింధియా వివరించారు.