అదిరిపోయే టెక్నాలజీ.. డిజిటల్‌ ఇన్‌ హేలర్‌ ఎలా పనిచేస్తుందంటే? | How Do You Use A Digihaler Inhaler | Sakshi
Sakshi News home page

అదిరిపోయే టెక్నాలజీ.. డిజిటల్‌ ఇన్‌ హేలర్‌ ఎలా పనిచేస్తుందంటే?

Aug 20 2023 11:00 AM | Updated on Aug 20 2023 11:11 AM

How Do You Use A Digihaler Inhaler - Sakshi

ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇన్‌హేలర్‌ వాడక తప్పదు. ఇన్‌హేలర్లు నోట్లోకి ఔషధాన్ని విడుదల చేసి, స్వేచ్ఛగా ఊపిరి ఆడేలా చేస్తాయి. ఇవి వాడే ప్రతిసారీ కచ్చితమైన మోతాదులోనే ఔషధం విడుదల అవుతుందనే భరోసా లేదు.

సాధారణ ఇన్‌హేలర్లు వాడిన ప్రతిసారి విడుదల చేసే ఔషధం మోతాదులో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితంగా నిర్దిష్టమైన మోతాదులోనే ఔషధం విడుదల చేస్తుంది. ఇది యాప్‌ ద్వారా బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది.

ఈ డిజిటల్‌ ఇన్‌హేలర్‌ను బ్రిటన్‌కు చెందిన ‘టెవా’ కంపెనీ ‘గో రెస్ప్‌ డిజిహేలర్‌’ బ్రాండ్‌ పేరుతో రూపొందించింది. ఈ డిజిహేలర్‌ రెండు మోడల్స్‌లో దొరుకుతుంది. ఒక మోడల్‌ 55/14 మైక్రోగ్రాములు, రెండో మోడల్‌ 113/14 మైక్రోగ్రాముల ఔషధాన్ని విడుదల చేస్తాయి. ఈ డిజిహేలర్‌ ధర 399 డాలర్లు (రూ.32,709) మాత్రమే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement