హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!  | Honda Activa Limited Edition launched at Rs 80734 | Sakshi
Sakshi News home page

Honda Activa: హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే! 

Sep 28 2023 10:13 PM | Updated on Sep 29 2023 9:07 PM

Honda Activa Limited Edition launched at Rs 80734 - Sakshi

ఏదైనా స్కూటర్‌ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్‌ అయింది.

హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు.

ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్‌లో రెండు కలర్‌ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో  డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్‌లు ఉంటాయి. DLX వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్‌లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement