రూ.16,195 కోట్ల టాక్స్ నోటీసుపై హైకోర్టు స్టే | Sakshi
Sakshi News home page

రూ.16,195 కోట్ల టాక్స్ నోటీసుపై హైకోర్టు స్టే

Published Tue, Oct 24 2023 9:28 PM

High Court Stay On Rs 16195 Crore Tax Notices - Sakshi

డెల్టాకార్ప్ సంస్థకు జారీ చేసిన రూ.16,195 కోట్ల జీఎస్టీ నోటీసుపై తుది ఉత్తర్వులు ఇవ్వకూడదని బొంబాయి హైకోర్టు గోవాబెంచ్‌ తేల్చి చెప్పింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనంతో డెల్టాకార్ప్‌ షేర్ హోల్డర్లకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. గత నెలలో డెల్టాకార్ప్‌తో పాటు అనుబంధ సంస్థలకు దాదాపు రూ.23,000 కోట్ల మేర పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులు అందాయి. 

ముందస్తు అనుమతి లేకుండా రూ.16,195 కోట్ల పన్ను నోటీసుపై తుది ఉత్తర్వులు జారీ చేయరాదని బొంబాయి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 23న కంపెనీ, దాని అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను బాంబే హైకోర్టు పరిశీలించింది. 

గేమింగ్, క్యాసినో వ్యాపారాలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో జీఎస్టీ పన్ను రేట్లను సైతం భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పన్ను నోటీసులతో సతమతమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement