హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ అయిన ప్యాషన్ ప్లస్ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. ఇది ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో పాటు మెరుగైన భద్రతను అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దీని ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).
కొత్త వేరియంట్‌లో స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్‌కు బదులుగా.. ముందు వైపు డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. ఈ అప్‌గ్రేడ్ ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చే పట్టణ ప్రాంతాల్లో, మెరుగైన బ్రేకింగ్ పనితీరును, నియంత్రణను అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్ హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్ అనే నాలుగు డ్యూయల్ టోన్ రంగులలో అందుబాటులో ఉంది.
బ్రేకింగ్ అప్‌గ్రేడ్‌తో పాటు, ప్యాషన్ ప్లస్ డిస్క్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది. ఈ కన్సోల్‌లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్స్, కాల్ అండ్ SMS అలర్ట్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, అదనపు భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్, USB ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటివి కూడా ఉన్నాయి.
మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి అదే 100 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 5.9 కిలోవాట్ల పవర్, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హీరో ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్)తో కలిసి పనిచేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ 71 కిమీ/లీ మైలేజ్ ఉస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇదీ చదవండి: ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!


