హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌, ఎండీగా డాక్టర్ డీకే సునీల్‌ | HAL appoints DK Sunil as chairman and managing director | Sakshi
Sakshi News home page

హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌, ఎండీగా డాక్టర్ డీకే సునీల్‌

Sep 9 2024 8:03 PM | Updated on Sep 9 2024 8:29 PM

HAL appoints DK Sunil as chairman and managing director

ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ డీకే సునీల్‌ నియమితులయ్యారు. ఆయన నియామకం సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వస్తుందని హెచ్‌ఏఎల్‌ పేర్కొంది.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 2022 సెప్టెంబర్ 29 నుండి డైరెక్టర్ (ఇంజనీరింగ్, ఆర్‌&డీ)గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్, ఎండీగా ఆయన పదవీకాలం 2026 ఏప్రిల్ 30 వరకు లేదా రక్షణ శాఖ నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అది కొనసాగుతుంది.

ఉస్మానియా పూర్వ విద్యార్థి
డాక్టర్ సునీల్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. మద్రాస్ ఐఐటీ నుండి ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చేశారు. 2019లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎలక్ట్రానిక్స్ సైన్స్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో సుమారు 37 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్‌ సునీల్‌ 1987లో సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. తర్వాత ఇప్పటి వరకు వివిధ పాత్రలలో పనిచేశారు. డిజైన్, ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో సేవలు అందించారు. సునీల్‌ నాయకత్వంలో హై పవర్ రాడార్ విద్యుత్ సరఫరా, వాయిస్ యాక్టివేటెడ్ కంట్రోల్ సిస్టమ్, కంబైన్డ్ ఇంటరాగేటర్ ట్రాన్స్‌పాండర్ వంటి కొత్త సాంకేతికతలు అభివృద్ధి చేశారు. ఇవి కంపెనీకి కొత్త వృద్ధి ప్రాంతాలుగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement